Whammo: Delivered..Waddanna kissed..Finally
mictv telugu

వామ్మో: డెలివరీ చేశాడు..వద్దన్నా ముద్దుపెట్టాడు..చివరికి

September 20, 2022

దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ డెలివరీ భాయ్ చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆకలిగా ఉందని ఓ కస్టమర్ ఆన్‌లైన్‌లో పుడ్ ఆర్డర్ పెడితే, డెలివరీ చేసిన అనంతరం ఆ కస్టమర్ వద్దు వద్దు అని ఎంత మొత్తుకుంటున్నా, అవేమి పట్టించుకోకుండా బలవంతంగా ముద్దులు పెట్టాడు. అంతటితో ఆగకుండా కస్టమర్ ఫోన్ నెంబర్‌కి అసభ్యకరంగా మేసేజ్‌లు చేసి చివరికి కటకటలాపాలయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని పూణె యెవలేవాడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఓ యువతి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫుడ్‌ను జొమాటో డెలివరీ మ్యాన్(42) తీసుకువచ్చాడు. ఫుడ్‌ను ఆమెకు ఇచ్చాక, కొన్ని మంచినీరు కావాలని ఆడిగాడు. దాంతో యువతి అతనికి మంచినీరు తీసుకువచ్చి ఇచ్చింది. ఈ సమయంలో యువతితో అతను మాటలు కలిపాడు. ఇంట్లో ఎవరున్నారు? ఏం చేస్తుంటారు? అని ఆరా తీశాడు.

అనంతరం మరో గ్లాస్ వాటర్ కావాలని కోరడంతో ఆ యువతి వాటర్ తీసుకువచ్చేందుకు ఇంట్లోకి వెళుతూ వెనక్కి తిరిగింది. అదే ఛాన్స్‌గా భావించిన జొమాటో మ్యాన్‌.. అమ్మాయిని బలవంతంగా పట్టుకుని చెంపలపై ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత అతడు చేసిన పనిని కవర్ చేసుకోవడానికి.. నేను నీకూ మామయ్య లాంటివాడిని. ఏ అవసరం ఉన్నా, నాకు కాల్ చేసి చెప్పొచ్చు” అని ఆ అమ్మాయికి చెప్పాడు.

ఆ తర్వాత ఆ జోమాటో మ్యాన్.. మళ్లీ ఆ అమ్మాయి వాట్సప్‌కు మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. దాంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న యువతి..వెంటనే పోలీసులను ఆశ్రయించింది. జొమాటో డెలివరీ మ్యాన్‌పై ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని పేర్కొంటూ కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెలివరీ భాయ్ తాట తీశారు.