Home > Featured > ఆహార ప్రియులకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేయొచ్చు

ఆహార ప్రియులకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేయొచ్చు

దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో తాజాగా ఇంటర్‌సిటీ లెజెండ్స్ అనే కొత్త డెలివరీ సర్వీసును పరిచయం చేయబోతుంది. దీని ద్వారా ఇతర నగరాల్లో ఫేమస్ రెస్టారెంట్ల నుంచి వంటకాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును భోజన ప్రియులకు కల్పిస్తుంది. డెలివరీ కొన్ని సందర్భాల్లో ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ప్రస్తుతానికి జొమాటో ఈ డెలివరీ ఎంపికను కేవలం గురుగ్రామ్, దక్షిణ ఢిల్లీ కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తోంది. త్వరలో ఇతర నగరాలకు విస్తరించనుంది. ఇప్పటి వరకు లోకల్ రెస్టారెంట్ ఫుడ్ తోనే సరిపెట్టుకుంటున్న.. భోజన ప్రియులకు ఇప్పుడు జొమాటో రూపంలో మంచి అవకాశం లభించింది. ఆర్డర్ చేసిన వారికి ఏ మాత్రం గాలి చొరబడని ప్యాక్ లో, పదార్థం పాడైపోకుండా మరుసటి రోజున జొమాటో అందిస్తుంది

ఈ విషయాన్ని జొమాటో ఫౌండర్‌, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి బాగా ఇష్టపడే కొన్ని వంటకాలను తన క‍స్టమర్లకు రుచి చూపించనున్నట్టు తెలిపారు. తమ ఇంటి వద్ద నుండే ఐకానిక్ వంటకాలను ఎవరైనా ఆర్డర్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. భారతదేశంలోని కోల్‌కతా రసగుల్లా, హైదరాబాద్ బిర్యానీ, లక్నో కబాబ్స్, జైపూర్ కచోరీ, పాత ఢిల్లీ నుండి బటర్ చికెన్ లేదా ప్యాజ్ వంటి వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాదించవచ్చు. దేశంలోని పాపులర్‌ వంటకాలు ఏవైనా ఇంటర్‌సిటీ లెజెండ్స్ ద్వారా పొందవచ్చని తెలిపారు. రంగు రుచీ వాసన,నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా బెస్ట్‌ఫుడ్‌ అందిస్తామని చెప్పారు.

Updated : 1 Sep 2022 1:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top