కడుపుకే కాదు కంటికి కూడా..జొమాటోలో వీడియోలు - MicTv.in - Telugu News
mictv telugu

కడుపుకే కాదు కంటికి కూడా..జొమాటోలో వీడియోలు

September 13, 2019

ప్రముఖ దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరో కీలక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు పోటీగా జొమాటో ఒరిజినల్స్ పేరుతో జొమాటో యాప్‌లో వీడియోలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. 

జొమాటో ఒరిజినల్స్‌లో 18 షోలు అందుబాటులో ఉండనున్నాయి. మూడు నెలల్లో మొత్తం 2000 వీడియోలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. సెప్టెంబర్ 16 నుంచి ఈ వీడియోలు జొమాటో అప్లికేషన్‌లో అందుబాటులోకి రానున్నాయి. జొమాటో అందించనున్న వీడియోల నిడివి మూడు నుంచి 15 నిముషాలు ఉండనుంది. యాప్‌లో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసిన తరువాత.. అది డెలివరీ అయ్యే లోపు బోర్ కొట్టకుండా జొమాటో ఒరిజినల్స్ వీడియోలను వీక్షించవచ్చని జొమాటో సీఈఓ దీపేందర్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపింది.