కాబోయే ప్రధాని ఎవరో చెబితే జొమాటోలో 30% క్యాష్ బ్యాక్ - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే ప్రధాని ఎవరో చెబితే జొమాటోలో 30% క్యాష్ బ్యాక్

May 21, 2019

zomato offers cashbacks to customers who predict the next PM.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరో వినూత్న క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌కు సమయం దగ్గరపడుతోన్న సంగతి తెలిసిందే. మే 23న వెలువడే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. సరిగ్గా ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ‘జొమాటో ఎలక్షన్ లీగ్’ ఆఫర్‌ను ప్రకటించింది. కాబోయే ప్రధాని ఎవరో సరిగ్గా ఊహిస్తే 30 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు పేర్కొంది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మే 22 వరకు ప్రతి ఆర్డర్‌పై కాబోయే ప్రధాని ఎవరో ఊహించొచ్చు. జొమాటో ఇప్పటికే పలు రెస్టారెంట్లపై 40 శాతం డిస్కౌంట్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ డిస్కౌంట్‌కు అదనంగా జొమాటో ఎలక్షన్ లీగ్ క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు. కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాప్‌లోనే ప్రధాని ఎవరో ఎంచుకోవాల్సి ఉంటుంది. మోదీ, రాహుల్ గాంధీ, ఇతరులు అనే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఐపీఎల్ సమయంలో కూడా జొమాటో ఇలాంటి వినూత్న ఆఫర్‌ను వినియోగదారులకు అందించింది.