కష్టమర్స్‌ను ఆకర్షించే పనిలో భాగంగా జొమాటో సరికొత్త సేవలతో ముందుకొచ్చింది. “జొమాటో ఎవ్రీడే” పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సేవల్లో భాగంగా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందించనుంది. ఎవ్రీడే సేవల్లో కస్టమర్లు 10 నిమిషాల వ్యవధిలోనే హోమ్ స్టైల్ ఫుడ్‌ను పొందవచ్చు. ప్రయోగాత్మకంగా మొదట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించనున్నారు. తర్వాత విడతల వారీగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఫుడ్ పార్ట్‌నర్స్, హోమ్ చెఫ్‌లతో జొమాటో భాగస్వామ్యం కుదుర్చుకుంది.హోమ్ స్టైల్ మీల్స్ ధర రూ. 89 నుంచి ప్రారంభం కానుంది. గతంలో ఇలాంటి సేవలు అందుబాటులో ఉండగా..వాటిని రద్దు చేశారు.
అదే విధంగా డెలివరీ బాయ్స్ కోసం జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్స్ లేని మమయంలోనూ, అలసిపోయిన సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు రెస్ట్ రూమ్స్‌ను నిర్మించాలని నిర్ణయించింది.వాటిలో డెలివరీ బాయ్స్ విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాట్ల చేయనుంది. ప్రస్తుతం వేసవి కాలం సమీపిస్తుండడంతో డెలివరీ బాయ్స్‌కి రెస్ట్ రూమ్స్‌లో కాసేపు సేదతీరే అవకాశం ఉంటుంది.