జొమాటో ఇన్వెెస్టర్లకు చేదు డెలివరీ.. షేర్ల ధర భారీగా.. - MicTv.in - Telugu News
mictv telugu

జొమాటో ఇన్వెెస్టర్లకు చేదు డెలివరీ.. షేర్ల ధర భారీగా..

May 6, 2022

షేర్ మార్కెట్ బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు కాస్త ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. షేరు ధర ఎక్కువున్న సమయంలో ఫ్యూచర్ లో కూడా దాని విలువ పెరుగుతుందని తొందరపడి కొనేయకూడదు. లేదంటే జోమాటో షేరు కొన్న ఇన్వెస్టర్లకు ఎదురైన పరిస్థితే మిగతా వారికి వస్తుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో ఐపీవోకు వస్తుందనగానే రిటైల్ ఇన్వెస్టర్లంతా ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.76 పెట్టి కొనుగోలు చేశారు. 2021 జూలై 16న ఇష్యూ ముగిసింది. వారం రోజుల తర్వాత రూ.115 వద్ద లిస్ట్ అయిన షేరు ఇన్వెస్టర్లకు మంచి లాభాలు కురిపించింది.

ఇది తెలిసిన మిగతా ఇన్వెస్టర్లు కూడా లాభాలు వస్తున్నాయి కదా అని .. ఐపీవోలో షేరు దక్కకపోయినా సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2021 నవంబర్ లో ఒక్కో షేరు ధర రూ.169 గరిష్ఠ స్థాయిని చూసింది. ఇక అప్పటి నుంచి షేర్ ధర కిందకు పడిపోవడంతో లబోదిబో అంటున్నారు. తాజాగా శుక్రవారం నాటి షేరు ధర రూ.59. ఐపీవో ధర రూ.76తో పోల్చి చూస్తే 20 శాతం తక్కువ. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.169 నుంచి చూస్తే 65 శాతం తక్కువ. తాజా గణాంకాలతో రిటైల్ ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు.