జూ. ఎన్టీఆర్‌ అభిమానిపై..బాబు ఫైర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

జూ. ఎన్టీఆర్‌ అభిమానిపై..బాబు ఫైర్‌

May 14, 2022

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు శుక్రవారం కుప్పంలో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా జూ. ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు శివపై ఆయన నోరు పారేసుకున్నారు. ‘శుక్రవారం ఉదయం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కవరేజికి జూ. ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకుడు శివ వచ్చాడు. అతడిని చూసిన చంద్రబాబు పీఏ మనోహర్‌.. ‘సార్‌ కుప్పంలో శివ జూ. ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జూ. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని కొన్ని నెలలుగా బ్యానర్లు కడుతున్నాడు’ అని చెవిలో చెప్పాడు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా మండిపడ్డారు. ‘అభిమానం వేరు. పార్టీ వేరు. పార్టీలో చీలికలు తేవడం మంచిది కాదు” అని శివను హెచ్చరించారు. పార్టీలో జూ. ఎన్టీఆర్‌ ప్రస్తావన తేవద్దని సంకేతాలు ఇస్తూ ఊగిపోయారు.

మరోపక్క జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా? అని గతకొన్ని నెలలుగా తహతహలాడుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని, ఆ చరిత్రను సృష్టించటం ఒక్క జూ.ఎన్టీఆర్ వల్లే సాధ్యమవుతుందని ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. గతకొన్ని నెలల క్రితం జూ.ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.