టాలీవుడ్లోకి జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నటిస్తున్న సినిమాకు సంబంధించి ఫస్టులుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. గతకొన్ని రోజులుగా నార్నె నితిన్ చంద్ర ఎంట్రీకి సంబంధించిన ఇండస్ట్రీలో పలు విషయాలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావంతో సినిమాకి సంబధించి ఫస్టులుక్ పోస్టర్ బయటికి రావడానికి కొంత ఆలస్యమైంది. ఈ సినిమాకి చిత్రబృందం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సినిమాను చింతపల్లి రామారావు – ఎమ్మెస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి టైటిల్‌తో కూడిన నితిన్ చంద్ర ఫస్టులుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో నడుస్తూ, సిగరెట్ వెలిగించే ఈ పోస్టర్లో నార్నె నితిన్ చంద్ర మాస్ లుక్‌తో రఫ్‌గా కనిపిస్తున్నాడు. కైలాస్ మీనన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు.