పులి లేదని బోన్ లోకి వెళితే... - MicTv.in - Telugu News
mictv telugu

పులి లేదని బోన్ లోకి వెళితే…

May 30, 2017


బ్రిటన్‌లోని ఒక జూ పార్క్‌… సందర్శకులతో హడావుడి…. ఇంతలో పులి బోన్‌లో లేదని.. రోసాకింగ్‌ అనే జూకీపర్‌ లోపలికి వెళ్లింది. అయితే ఆమె వెనుకే పులి కూడా బోన్‌లోకి వచ్చింది. ఇది గమనించేలోపే పులి దాడి చేసింది. తోటి సిబ్బంది కళ్లముందే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటనతో జూను మూసివేశారు. కేంబ్రిడ్జ్‌షూర్‌లోని హంటింగ్డన్‌ సమీపంలో స్థానిక హమెర్టన్‌ జూ పార్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇది అసాధారణ ఘటన అని, సదరు ఉద్యోగి బోన్‌ లోపలికి ఎందుకు వెళ్లిందా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు.