Zookeeper dies after tiger savages his arm in horrifying video
mictv telugu

పులితో చెలగాటం.. నెత్తురోడి, గుండెపోటుతో చనిపోయాడు!

June 17, 2022

Zookeeper dies after tiger savages his arm in horrifying video

ప్రమాదకరమైన జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం అంత తేలికైన పని కాదు. దీనికి నైపుణ్యం, శ్రద్ధ రెండూ అవసరం. ఎప్పుడైనా జంతువు స్థితిని పసిగట్టలేకపోతే, అది మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతుంది. పశ్చిమ మెక్సికోలోని పెరిబన్ అనే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. బోనులో ఉన్న పులికి ఆహారం అందించబోయి.. ఓ జూ కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. పులి అతడి చేతిని గట్టిగా కొరకడంతో తీవ్రంగా గాయపడి.. గుండెపోటుతో మరణించాడు.

జూ కీపర్ గా పనిచేస్తున్న… జోస్ డి జీసస్‌(23) అనే యువకుడు పులి బోను వద్ద బయటివైపు నిలబడి, దానికి ఆహారం అందించేందుకు చేతిని లోపలికి పెట్టాడు. పులి దగ్గరకు రాగానే, దాని మెడ దగ్గర కొట్టాడు. దీంతో ఆ పులి బోనులో నుండే అతడి కుడి చేతిని గట్టిగా గట్టిగా నోటితో పట్టుకుని కొరికేసింది. అతడు అరుస్తున్నా పులి మాత్రం ఆ చేయి వదలకుండా తీవ్ర రక్తస్రావం అయ్యేలా గట్టిగా కొరికింది.

వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది.. గాయాలపాలైన జోస్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడి చేతిని తీసేయాలని చెప్పారు. అయితే అందుకు అతడు నిరాకరించాడు. దీనికి తోడు అతడికి షుగర్ వ్యాధి కూడా ఉండడంతో డాక్టర్ ఆ విషయం చెప్పేసరికి భయంతో గుండెపోటు వచ్చి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జూ మేనేజ్‌మెంట్ విడుదల చేసింది.